ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెగా బ్రదర్ కు బాలయ్య ఫాన్స్ సెగ

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 05, 2019, 03:32 PM

కొంత కాలంగా మెగా బ్రదర్ నాగబాబు.. అదే పనిగా నందమూరి బాలకృష్ణను టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడో ఒకసారి పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలకు రిటార్ట్‌గా ఇప్పుడు యుద్ధం మొదలుపెట్టాడు నాగబాబు. ఇంతకాలం సైలెంటుగా ఉన్న నాగబాబు ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటున్న సమయాన.. తన వంతుగా అగ్గి రాజేసే ప్రయత్నం చేస్తున్నాడు.

తన తమ్ముడి పార్టీ తరఫున క్రియాశీల పాత్ర పోషించాలని తహతహలాడిపోతున్న ఆయన.. బాలయ్యను లక్ష్యంగా చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఏదో ఒకసారి రెండుసార్లంటే ఓకే కానీ.. అదే పనిగా బాలయ్య మీద సైటెర్లు గుప్పించడమే అతిగా అనిపిస్తోంది. చివరగా ఆయన చేసిన ‘బ్రీడ్-బ్లడ్’ కామెంట్లతో నందమూరి అభిమానులకు మండిపోయింది. చివరికి ఎన్టీఆర్ బయోపిక్‌ మీద కూడా సెటైర్లు వేశాడు నాగబాబు.

నాగబాబు తీరుతో మండిపోతున్న బాలయ్య అభిమానులు.. నాగబాబు ఎక్కడ దొరుకుతాడా అని చూస్తున్నారు. ఆయన చెన్నైలోని ఒక ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన ఒక వేడుకకు ముఖ్య అతిథిగా వెళ్లాడు. దీంతో అక్కడున్న బాలయ్య అభిమానులు రెచ్చిపోయారు. నాగబాబు కనిపించగానే జై బాలయ్య నినాదాలతో హోరెత్తించేశారు. నాగబాబు డౌన్ డౌన్ అని కూడా అరిచారు. అంతకంతకూ నినాదాలు పెరిగాయే తప్ప తగ్గలేదు. దీంతో నాగబాబు అక్కడ ప్రసంగం కూడా చేయకుండానే నిష్క్రమించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మొత్తానికి ఇన్నాళ్లూ బాలయ్యను గిల్లుతూ వినోదం చూసిన నాగబాబు.. తొలిసారి బాలయ్య అభిమానుల నుంచి ఇబ్బంది ఎదుర్కొన్నాడు. అనవసరంగా వివాదాన్ని పెద్దది చేయడమెందుకని ఇకనైనా ఆయన తగ్గుతారేమో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa