ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హ్యాపీ బర్త్ డే దీపికా పడుకొనే

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 05, 2019, 03:43 PM

ఆమె అందం సౌందర్యానికే నిర్వచనంలా ఉంటుంది. ఆ నవ్వు విరబూసిన మల్లే కన్నా తెల్లగా ఉంటుంది. పూవుకు తావిలా...అందానికి అభినయం తోడై బాలీవుడ్‌ను ఏలుతున్న తార. ఆమె ఇంకెవరో కాదు బ్యూటిఫుల్, ఛార్మింగ్, క్యూట్, ఎనర్జిటిక్ కథానాయిక దీపికా పదుకోనె. రీసెంట్‌గా తన ఆన్ స్క్రీన్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను ఆఫ్ ది స్క్రీన్ పెళ్లి చేసుకుని ఒకింటామె అయింది. పెళ్లి తర్వాత దీపికా జరుపుకుంటున్న ఫస్ట్ బర్త్ డే ఆమె జీవితంలో మరిచిపోలేనిదని చెప్పొచ్చు. ఈ సందర్భంగా ఆమె నట ప్రస్థానంపై చిన్న లుక్.


బ్యాడ్మెంటిన్ క్రీడాకారిణిగా కెరీర్ ప్రారంభించి..మోడల్ గా మెరిసి, సిల్వర్ స్ర్కీన్ పై ప్రత్యేకతను చాటుకుంటున్న హీరోయిన్ దీపిక పదుకోనె. డెన్మార్క్ లోని కోపెన్ హగెన్లో  జనవరి 5, 1986లో ఉజ్వల, తండ్రి ప్రకాష్ పదుకోనెలకు జన్మించింది.దీపికకు పదకొండేళ్ల వయసులోనే దీపిక కుటుంబం ఇండియాకు వచ్చేశారు. బెంగుళూర్‌లో స్థిరపడ్డారు. తండ్రి  ప్రకాష్ పదుకోన్ అంతర్జాతీయ  బ్యాడ్మింటన్ క్రీడాకారుడు..దీపిక కూడా తండ్రిలాగే రాష్ట స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా రాణించింది..తరువాత మోడలింగ్‌లోకి వచ్చింది.


ప్రముఖ ఉత్పత్తులైన లిరిల్, డాబర్, క్లోజప్ టూత్ పెస్ట్ వంటి వాటికి మోడలింగ్ చేసింది..కింగ్ ఫీషర్ ఫ్యాషన్ అవార్డులలో మోడల్ అఫ్ ది ఇయర్ అవార్డు కూడా అందుకుంది. మోడలింగ్ తో వచ్చిన గుర్తింపుతో  హిమేష్ రేష్మియా ‌‘ఆప్ కా సరూర్’ ఆల్బంలో నటించే అవకాశం వచ్చింది.నటిగా దీపికాకు మొదటి అవకాశం ఆమె మాతృభాష కన్నడలోనే వచ్చింది... 2006లో కన్నడలో ఉపేంద్ర హీరోగా నటించిన ‘ఐశ్వర్య’ అనే సినిమాలో తెరంగేట్రం చేసింది. రెండో సినిమాకే దీపికను అదృష్టం తలుపుతట్టింది. అది కూడా ఫరాఖాన్ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ సరసన నటించే అవకాశం వచ్చింది. ఆ  సినిమానే ‘ఓం శాంతి ఓం’. ఈ సినిమాతో దీపిక బాలీవుడ్ ఎంట్రీ చాలా గ్రాండ్‌గా మొదలయ్యింది. ఈ సినిమాలో తన ఫర్శామెన్సతో ఫిల్మ్ ఫేర్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డు  గెలుచుకుంది..ఈ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.


ఆ తర్వతా.. దీపిక రణ్‌బీర్ కపూర్‌తో ‘బచ్‌నా హై హసీనో , అక్షయ్ కూమర్‌తో ‘చాందిని చౌక్ టు చైనా’ సినిమాల్లో నటించింది. కొన్నిచిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌లోనూ తళుక్కున మెరిసింది. కానీ ఈ సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర పెద్దగా నడవలేదు.ఇలాంటి సమయంలోనే ‘లవ్ ఆజ్ కల్’ సినిమాలో అవకాశం వచ్చింది. ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో దీపిక కెరీర్ మళ్లీ గాడిలో పడినట్టైంది. రొమాంటిక్ కామెడి డ్రామాగా వచ్చిన ఈ మూవీ లో సైఫ్అలీ ఖాన్‌కు జోడిగా నటించింది..ఆ సినిమా హిట్ అయింది.


 


 


2010లో దీపిక నటించి 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి.. ‘కార్తిక్ కాలింగ్ కార్తిక్’, ‘హౌస్‌ఫుల్’ ,‘బ్రేక్ కే బాద్’, ‘లఫంగే ఫరిందే’, కేలిన్ హమ్ జీ జాన్ సే , కాక్‌టైల్ లాంటి సినిమాలు మంచి పేరు తీసుకొచ్చాయి.‘ఓమ్ శాంతి ఓం’ తర్వాత షారుక్ ఖాన్‌తో రెండో  సారి జోడి కట్టిన చిత్రం  ‘చెన్నై ఎక్స్ ప్రెస్...తమిల్ పొన్నుగా మీనా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసింది దీపిక. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. 2013 లో వచ్చిన ‘యే జవానీ హై దీవాని’ సూపర్ హిట్ అయ్యింది.


సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో రణవీర్ సింగ్, దీపికా పదుకోన్ హీరో, హీరోయిన్లుగా రెండు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి..ఒకటి రొమాంటిక్ ట్రాజడీ గా వచ్చిన ‘రామ్ లీల’ ఐతే ఇంకోటి హిస్టారికల్ రొమాంటిక్ మూవీగా తెరకెక్కిన ‘బాజీరావ్ మస్తానీ’..ఈ రెండు సినిమాలలో అందం, అభినయాలతో ప్రశంసలు అందుకుంది దీపిక.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa