ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూట్యూబ్ ని రఫ్ఫాడిస్తున్న రౌడీ బేబీ

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 05, 2019, 03:47 PM

సాయిపల్లవి నటిగా కంటే ముందు డ్యాన్సర్‌గా జనాలకు పరిచయం. ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షో చూసిన వాళ్లకు ఆమె ముందు నుంచే పరిచయం. ఒక సీజన్లో అదిరిపోయే డ్యాన్సులతో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇక తన తొలి సినిమా ప్రేమమ్లో తనదైన నటన, స్క్రీన్ ప్రెజెన్స్‌తో కట్టి పడేసిన సాయిపల్లవి.. ఆ సినిమాలో కూడా తన డ్యాన్స్ టాలెంట్ చూపించింది. ఆపై ఫిదా.. ఎంసీఏ చిత్రాల్లోనూ ఆమె నృత్య ప్రతిభను చూశాం. నచ్చిందే.. ఏవండోయ్ నాని గారు పాటల్లో సాయిపల్లవి డ్యాన్స్ చూసి ఫిదా అయిపోయారు జనాలు. ఐతే ఇవన్నీ ఒకెత్తయితే.. ఇప్పుడు మారి2 సినిమాలో ఆమె వేసిన స్టెప్పులు మరో ఎత్తు. ఇందులో రౌడీ బేబీ అంటూ సాగే ఒక పాట ఉంది. అందులో సాయిపల్లవి డ్యాన్స్ మామూలుగా లేవు.

ఈ ఒక్క పాట కోసం సినిమా చూడొచ్చు అనే స్థాయిలో డ్యాన్సులు ఇరగ్గొట్టేసింది సాయిపల్లవి. ధనుష్ కూడా బాగానే డ్యాన్స్ వేశాడు కానీ.. సాయిపల్లవి గ్రేస్, స్టయిల్, స్పీడ్ ముందు అతను నిలవలేకపోయాడు. ఓవైపు తనదైన శైలిలో ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ.. డ్యాన్సులు ఇరగదీసిందామె. పాట మొదలైనప్పటి నుంచి చివరిదాకా సాయిపల్లవిని కళ్లప్పగించి చూస్తూ ఉండాల్సిందే.

సినిమా రిలీజైన రెండు వారాల తర్వాత ఈ పాటను నేరుగా యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్ యూట్యూబ్‌లోకి వచ్చేయడంతో జనాలు విరగబడి చూస్తున్నారు. కేవలం రెండు రోజుల్లోనే ఈ పాటకు కోటి వ్యూస్ రావడం విశేషం. దక్షిణాదిన ఒక వీడియో సాంగ్‌కు ఇంత వేగంగా కోటి వ్యూస్ వచ్చిన చరిత్రే లేదు. ఈ పాట చిత్రీకరణ కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. పాట మొత్తం కలర్ థీమ్స్ ఆకట్టుకుంటాయి. డ్యాన్స్ కంపోజింగ్ టాప్ లెవెల్లో ఉండటంతో సాయిపల్లవి మరింతగా హైలైట్ అయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa