చరణ్ .. బోయపాటి కాంబినేషన్లో రూపొందిన 'వినయ విధేయ రామ' .. జనవరి 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, యు/ఎ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. చరణ్ యాక్షన్ .. కైరా గ్లామర్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని అంటున్నారు.
వివేక్ ఒబెరాయ్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించగా, స్నేహా .. ప్రశాంత్ .. ఆర్యన్ రాజేశ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి ముందు చరణ్ చేసిన 'రంగస్థలం' సంచలన విజయాన్ని సాధించడంతో, సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. సంక్రాంతి బరిలో దిగుతోన్న ఈ సినిమా, తమ హీరోకి బ్లాక్ బస్టర్ హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో చరణ్ అభిమానులు వున్నారు. వాళ్ల నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa