బ్రూస్ లీ, సాహో చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన కోలీవుడ్ హీరో అరుణ్ విజయ్ తన కొత్త సినిమా "ఆక్రోశం" ను డిసెంబర్ 9వ తేదీన తెలుగులో విడుదల చెయ్యనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలుగు మీడియాతో ముఖాముఖిలో పాల్గొన్న హీరో అరుణ్ విజయ్ డిసెంబర్ 9 నుండి డిసెంబర్ 16 కు సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్టు పేర్కొన్నారు. అరుణ్ విజయ్, పల్లక్ లల్వాని జంటగా నటించిన ఈ సినిమాకు GNR కుమారావేలన్ డైరెక్టర్ గా వ్యవహరించారు. సతీష్ కుమార్, విజయకుమార్ సంయుక్తంగా నిర్మించారు.