కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న హార్రర్ థ్రిల్లర్ "కనెక్ట్". తెలుగు, తమిళ భాషలలో డిసెంబర్ 23న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో కనెక్ట్ ట్రైలర్ మరికాసేపట్లోనే అంటే అర్ధరాత్రి పన్నెండు గంటలకు ప్రేక్షకులను భయపెట్టనుంది. అదేంటి అర్ధరాత్రి టైం లో ? అనుకుంటున్నారా..? నిజమే.. ఇది హార్రర్ థ్రిల్లర్ కాబట్టి ట్రైలర్ ను విడుదల చేసేందుకు మేకర్స్ మిడ్ నైట్ ను సెలెక్ట్ చేసుకున్నారు. విశేషమేంటంటే, కనెక్ట్ తెలుగు ట్రైలర్ ను పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ విడుదల చెయ్యనున్నారు.