రీసెంట్గా విడుదలైన "విట్నెస్" ట్రైలర్ ఆడియన్స్ ను విశేషంగా ఆకర్షించింది. మాన్యువల్ స్కావెంజింగ్ నేపథ్యంలో తెరకెక్కిన సీరియస్ పొలిటికల్ డ్రామాగా విట్నెస్ మూవీ కొంతసేపటి క్రితమే సోనీ లివ్ ఓటిటిలోకి స్ట్రీమింగ్ కొచ్చేసింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో సోనీ లివ్ ఓటిటిలో విట్నెస్ మూవీ అందుబాటులోకి వచ్చింది.
ఇందులో జెర్సీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హలో చెప్పిన కోలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ శ్రీనాధ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. రోహిణి కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు డైరెక్షన్ - సినిమాటోగ్రఫీ దీపక్ చేసారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మించారు. రమేష్ తమిళమని సంగీతం అందించారు.