మంచు వారసుడు హీరో మనోజ్ వెండితెరపై కనిపించి చాన్నాళ్ళే అవుతుంది. హిట్ కొట్టి కొన్ని సంవత్సరాలు అవుతుంది. చివరిగా 2017లో "ఒక్కడున్నాడు" సినిమాలో మనోజ్ హీరోగా నటించారు. ఆపై "అహం బ్రహ్మాస్మి" అనే యూనిక్ ప్రాజెక్ట్ ను ప్రకటించారు కానీ ఇప్పటివరకు ఆ సినిమాపై ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో ఆ సినిమా అటకెక్కిందనే అనుకున్నారంతా.
ఐతే లేటెస్ట్ గా మంచు మనోజ్ తన ట్విట్టర్ ఖాతాలో 'ఆడియోస్ అమిగో' అని కామెంట్ చేసి తన న్యూ లుక్ ను పోస్ట్ చేసారు. ఈ లుక్ లో మనోజ్ నుదుటున మూడు నామాలు దానిపై రక్తపు చుక్క... శివుడి నుదుటిపై ఉన్న మూడో కన్నులాగా అనిపిస్తుంది. ఆడియోస్ అమిగో అంటే .. ఫ్రెండ్స్ ఇక సెలవు అని అర్ధం.. అంటే మరి ఆయన నటిస్తున్న అహం బ్రహ్మాస్మి షూటింగ్ ముగిసిందని తెలుస్తుంది. ఐతే, ఈ పోస్ట్ పూర్తి అర్ధం తెలియాలంటే మనోజ్ ఇచ్చే నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చెయ్యాల్సిందే.