కన్నడ చిత్ర పరిశ్రమ తనపై నిషేధం విధించిందన్న వార్తలపై నటి రష్మిక తాజాగా స్పందించింది. ఈ వార్తలను ఖండిస్తూ.. తనపై ఎలాంటి నిషేధం విధించలేదని స్పష్టం చేసింది. ‘కాంతార’ సినిమా విషయంలో నాపై కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారు అని తెలిపారు. ఆ సినిమా చూసిన తర్వాత టీమ్‌కి మెసేజ్ పంపాను. నటీనటుల మధ్య ఏం జరుగుతుందో బయటి వారికి తెలియదు. నా వ్యక్తిగత విషయాలను కెమెరా పెట్టి ప్రపంచానికి చూపించలేను. మెసేజ్‌లు కూడా బయటకు రిలీజ్ చేయలేను. నా వ్యక్తిగత జీవితం గురించి చెప్పాల్సిన అవసరం లేదు అని రష్మిక అన్నారు.