బాబి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించింది. ఈ సినిమాలోని రెండు పాటల బ్యాలెన్స్ షూట్ మిగిలి ఉంది. దీంతో చిత్రబృందం యూరప్ వెళ్లింది. ఆ రెండు పాటల చిత్రీకరణ యూరప్‌లో జరుగుతోంది. దీంతో చిరంజీవి కుటుంబ సమేతంగా యూరప్ వెళ్లారు. ఈ సినిమా జనవరి 13న రిలీజ్ కానుంది.