AR అభి డైరెక్షన్లో బిగ్ బాస్ సీజన్ 4 సెకండ్ రన్నర్ అప్ సయ్యద్ రియాన్ సోహెల్ హీరోగా నటిస్తున్న చిత్రం "లక్కీ లక్ష్మణ్". రీసెంట్గానే ఈ మూవీ టీజర్ విడుదలై, ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యింది.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ గా కాలేజీ సాంగ్ ను విడుదల చేసేందుకు మేకర్స్ ముహూర్తం ఖరారు చేసారు. ఈ మేరకు రేపు రాహుల్ సిప్లిగంజ్, రోల్ రైడా పాడిన కాలేజీ సాంగ్ విడుదల కాబోతుందని తెలుపుతూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు.
మోక్ష హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై హరిత గోగినేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల్లోనే విడుదల కావడానికి రెడీ అవుతుంది. త్వరలోనే అధికారిక విడుదల తేదీ రానుంది.