హిట్ 2 పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ రోజు రాజమండ్రిలో హిట్ 2 చిత్రబృందం హల్చల్ చేసింది. హీరో అడివిశేష్, హీరోయిన్ మీనాక్షి చౌదరి, డైరెక్టర్ శైలేష్ కొలను.. రాజమండ్రిలోని ISTS ఉమెన్స్ కాలేజీ, మంజీరా సరోవర్, స్వామి ధియేటర్లను విజిట్ చేసి హిట్ 2 గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ఆడియన్స్ కి థాంక్స్ చెప్పారు. ఆరింటికి గోదావరి హారతి ఘాట్ లో ప్రత్యేక పూజలు చేసి, గోదావరి హారతిలో పాల్గొన్నారు. ఈ మేరకు కొన్ని పిక్స్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.