నటసింహం నందమూరి బాలకృష్ణ గారు కెరీర్ లో ఎన్నో మైథలాజికల్ చిత్రాల్లో నటించారు. శ్రీరామరాజ్యం, పాండురంగ మహత్యం... వంటి సినిమాలకు మోడరన్ డేస్ లో కూడా ఆడియన్స్ నుండి చాలా మంచి స్పందన వచ్చింది.
తాజాగా మరొకసారి బాలయ్య మైథలాజికల్ మూవీలో నటించబోతున్నట్టు ఇండస్ట్రీ టాక్. స్వామి రామానుజాచార్యుని పాత్రలో బాలకృష్ణ నటించబోతున్నారని, ఈ సినిమాకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు దర్శకత్వం చేస్తారని, ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తారని వినికిడి.
శ్రీ రామానుజాచార్యుల వారు వైష్ణవ మతానికి గురువు వంటి వారు. హిందూత్వ బోధకుడు, సంఘ సంస్కర్త.