బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ, యంగ్ హీరో సిద్దార్ధ్ మల్హోత్రాతో ప్రేమలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. కాఫీ విత్ కరణ్ టాక్ షోలో వీరి రిలేషన్ పై అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతానికి ఎవరి ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ తో వాళ్ళు చాలా బిజీగా గడుపుతున్న కియారా - సిద్దార్ధ్ ల వివాహం ఇప్పటికే ఎన్నోసార్లు హాట్ టాపిక్ గా నిలవగా, తాజాగా మరోసారి వీరి వివాహం వార్తల్లో నిలిచింది.
ఇద్దరి బిజీ షెడ్యూల్స్ కి కొంత విరామమిచ్చి వచ్చే ఏడాది మొదట్లో వివాహం చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ముందుగా గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుందామనుకున్నారు కానీ, సిద్దార్ధ్ కుటుంబసభ్యుల ఒత్తిడితో చండీఘర్ లో పంజాబీ సంప్రదాయంలో వివాహం చేసుకోవాలని నిర్ణయించున్నారట. మరి దీనిపై క్లారిటీ రావాలంటే ఈ ప్రేమ పక్షుల నుండి సమాధానం రావాల్సిందే.