ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరలక్ష్మి శరత్ కుమార్ "శబరి" షూటింగ్ పూర్తి

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 08, 2022, 11:50 PM

తెలుగు సినిమాలలో జోరు పెంచుతున్న కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం "శబరి". తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమా రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతుంది.


తాజా సమాచారం ప్రకారం, శబరి షూటింగ్ పూర్తయ్యింది. ఈ మేరకు మేకర్స్ నుండి అఫీషియల్ పోస్టర్ కూడా విడుదలైంది. షూటింగ్ పూర్తి చేసుకున్న శబరి ఇకపై పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుని, వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.


ఈ సినిమాని కొత్త దర్శకుడు అనిల్కట్జ్ అకా అనిల్ కుమార్ రూపొందిస్తున్నారు. మహా మూవీస్ బ్యానర్ పై మహేంద్రనాధ్ కొండ్ల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మహర్షి కొండ్ల సమర్పిస్తున్నారు. గోపి సుందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com