డిసెంబర్ 12న అంటే వచ్చే సోమవారం కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు. ఈ సందర్భంగా డిసెంబర్ 10న "బాబా" మూవీ రీ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.
తాజాగా రజినీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ "శివాజీ" కూడా రీ రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది. డిసెంబర్ 9-15 వరకు లిమిటెడ్ ధియేటర్స్ లో తమిళ్, హిందీ భాషలలో ఈ సెన్సేషనల్ మూవీ రిలీజ్ కాబోతుందని టాక్. ఐతే, ఈ విషయంపై ఇంకా ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదు.
మూవీ మావరిక్ శంకర్ షణ్ముగం డైరెక్షన్లో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో శ్రేయా శరణ్ హీరోయిన్ గా నటించారు. AR రెహమాన్ సంగీతం అందించారు.