వాస్తవ సంఘటనల ఆధారంగా డైరెక్టర్ ఆంథోనీ మట్టిపల్లి డైరెక్ట్ చేస్తున్న చిత్రం "గీతసాక్షిగా". బుల్లితెర నటుడు ఆదర్శ్, చిత్ర శుక్ల జంటగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, అనితా చౌదరి, రాజా రవీంద్ర కీలకపాత్రల్లో నటించారు.
షూటింగ్ ముగించుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా నుండి తాజాగా "అమ్మ మనసు" అనే కమ్మనైన లిరికల్ వీడియో విడుదలైంది. KS చిత్రగారి గాత్రంతో ఈ పాట నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. గోపీసుందర్ అద్భుతమైన ట్యూన్ కి, రెహ్మాన్ హార్ట్ టచింగ్ లిరిక్స్ అందించారు.