కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార నుండి రాబోతున్న తొలి హార్రర్ థ్రిల్లర్ "కనెక్ట్". ఈ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు కనెక్ట్ ట్రైలర్ విడుదలైంది. రీసెంట్గా విడుదలైన టీజర్ తో హార్రర్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన కనెక్ట్ మూవీ నుండి తాజాగా విడుదలైన ట్రైలర్ క్రిస్పీ హార్రర్ ఎలిమెంట్స్ తో స్పైన్ చిల్లింగ్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ను భయపెడుతుంది.
డిసెంబర్ 22న తెలుగు, తమిళ భాషలలో థియేటర్లలో విడుదల కాబోతున్న కనెక్ట్ మూవీలో బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్, కోలీవుడ్ విలక్షణ నటుడు సత్యరాజ్, వినోద్ రాయ్,నసిఫా హనియా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
మాయ, గేమ్ ఓవర్ చిత్రాల దర్శకుడు అశ్విన్ శరవణన్ ఈ సినిమాను డైరెక్ట్ చేసారు. పృథ్వి చంద్రశేఖర్ సంగీతం అందించారు.