ఈ ఏడాదిలో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ "బింబిసార" తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఆపై కళ్యాణ్ రామ్ న్యూ ప్రాజెక్ట్స్ పై ఆడియన్స్ క్యూరియాసిటీ చూపిస్తున్నారు. "అమిగోస్" తో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆడియన్స్ ను అలరించనున్న కళ్యాణ్ రామ్ నటిస్తున్న మరొక క్రేజీ ప్రాజెక్ట్ "డెవిల్ : ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్".
శ్రీకాంత్ విస్సా రచించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామాను నవీన్ మేడారం డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో నందమూరి కళ్యాణ్ రామ్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
తాజా అప్డేట్ ప్రకారం, డెవిల్ న్యూ షెడ్యూల్ తమిళనాడు, మధురైలోని కారైకుడిలో జరుగుతుంది. ఇరవై రోజులపాటు జరిగే ఈ షెడ్యూల్ లో పాల్గొనడానికి వెళ్తున్న కళ్యాణ్ రామ్ ఎయిర్పోర్ట్ పిక్స్ నిన్న మీడియాలో వైరల్ అయ్యాయి.