ఈ రోజు అర్ధరాత్రి నుండి యశోద మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటిలో, పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ అవ్వడం మొదలెట్టింది. అద్భుతమైన ధియేటర్ రన్ ను ఇంకా కొనసాగిస్తున్న యశోద డిజిటల్ ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.
హరి శంకర్, హరీష్ నారాయణ్ ల డైరెక్షన్లో ఫిమేల్ సెంట్రిక్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా నవంబర్ 11న థియేటర్లలో విడుదలై, సూపర్ పాజిటివ్ రివ్యూలను అందుకుంది. బాక్సాఫీస్ వద్ద చాలా మంచి కలెక్షన్లను రాబట్టింది. చాన్నాళ్ల తరవాత సమంతకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ బిగ్ కమర్షియల్ సక్సెస్ ను అందించింది.
మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించారు. వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, సంపత్ రాజ్, మురళీశర్మ, రావురమేష్ కీలకపాత్రల్లో నటించారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.