ఆగస్టు 12న భారీ అంచనాల నడుమ విడుదలైన హీరో నితిన్ "మాచర్ల నియోజకవర్గం" దాదాపు నాలుగు నెలల గ్యాప్ తీసుకుని నిన్న అర్ధరాత్రి నుండే జీ 5 ఓటిటిలోకి స్ట్రీమింగ్ కొచ్చింది. MS రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్లో ఔటండౌట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో నితిన్, కృతిశెట్టి జంటగా నటించారు. ప్రమోషనల్ కంటెంట్ కు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ వెండితెరపై మ్యాజిక్ ను సృష్టించలేక మాచర్ల నియోజకవర్గం బాక్సాఫీస్ వద్ద చతికిలబడింది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో సముద్రఖని విలన్గా నటించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.