అనతికాలంలోనే నేషనల్ క్రష్ ట్యాగ్ ను తగిలించుకుని పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న ఏకైక హీరోయిన్ రష్మిక మండన్నా. పుష్ప ప్రమోషన్స్ నిమిత్తం రష్యాలో ఉన్న రష్మిక నిన్ననే తిరిగి ఇండియాకు వచ్చింది. ఈ నేపథ్యంలో మీడియా ఆమెను తనపై వస్తున్న ట్రోల్స్ గురించి అడిగింది.
కన్నడ సినిమా నుండి రష్మికను బ్యాన్ చేసారని సోషల్ మీడియాలో నిన్నటి వరకు జరిగిన ప్రచారానికి రష్మిక తన స్టైల్ లో సమాధానం చెప్పి, ట్రోలర్స్ కి చెక్ పెట్టింది. కన్నడ సినీపరిశ్రమ నుండి తనను ఎవ్వరూ బ్యాన్ చెయ్యలేదని, కాంతార సినిమాను చూశానని, వెంటనే చిత్రబృందాన్ని అభినందించానని, ఇక్కడ ఎం జరుగుతుందో, ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయో బయట చూసేవారికి తెలియదని.. కొంచెం ఘాటుగానే రెస్పాండ్ అయ్యింది. మొత్తానికి కన్నడ సినిమా నుండి రష్మిక బ్యాన్ అవ్వలేదని అఫీషియల్ గా క్లారిటీ వస్తుంది.
ప్రస్తుతం రష్మిక కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సరసన "వారిసు" లో నటిస్తుంది. ఆ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళ భాషలలో విడుదల కాబోతుంది.