యంగ్ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న కొత్త చిత్రానికి "కళ్యాణం కమనీయం" అనే యూనిక్ టైటిల్ ను ఫిక్స్ చేసారని, ఇందులో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తుందని, జనవరి 14న గ్రాండ్ రిలీజ్ కాబోతుందని, ఫస్ట్ లుక్ ఈరోజు మధ్యాహ్నం 12:24 నిమిషాలకు విడుదల కాబోతుందని సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతుంది.
ఒకవేళ ఈ సినిమా సంక్రాంతి రేస్ లో దిగితే, బిగ్ హీరో సినిమాల ధియేటర్స్ కౌంట్ లో కొంత డిస్టర్బన్స్ కలిగినట్టే. ఎందుకంటే ఈ సినిమాను నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ కు ఆంధ్రా, తెలంగాణాలలో చాలా మంచి ధియేటర్ కౌంట్ ఉంది మరి.
ఈ విషయాలన్నీ పక్కన పెడితే, అసలు సంతోష్ శోభన్ సంక్రాంతికి న్యూ మూవీని రిలీజ్ చేస్తున్నాడా? అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే, అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చేంతవరకు వెయిట్ చెయ్యాల్సిందే.