హీరోయిన్ హెబ్బాపటేల్ లీడ్ రోల్ లో నటిస్తున్న థ్రిల్లర్ మూవీ "బ్లాక్ అండ్ వైట్". LNV సూర్యప్రకాష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా యొక్క ట్రైలర్ కొంతసేపటి క్రితమే విడుదలైంది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలను మరింత ఇంట్రిగ్యుయింగ్ గా చేసింది. ఇందులో హెబ్బాపటేల్ గ్రేట్ పెయింటర్ కావాలని ఆశపడుతుంది. మరి, తన కలలను ఎవరు నాశనం చేసారు? తను ఎవరిని చంపింది? తనని ఎవరు చంపారు? తను మళ్ళి ఎలా బతికింది? ప్రశ్నలకు సమాధానం కావాలంటే సినిమా చూడాల్సిందే.
ఈ సినిమాలో సూర్య శ్రీనివాస్, లహరి షరి, నవీన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. SR ఆర్ట్స్, U &I స్టూడియోస్ సంయుక్త బ్యానర్లపై పద్మనాభరెడ్డి, సందీప్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాను మేఘన రెడ్డి సమర్పిస్తున్నారు.