మాస్ రాజా రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం "ధమాకా" నుండి నిన్న దండకడియాల్ అనే ఫాస్ట్ బీట్ మాస్ సాంగ్ విడుదల కాగా, రవితేజ మార్క్ మాజికల్ ట్యూన్ తో ఈ పాట ఆడియన్స్ ఇట్టే కనెక్ట్ అయిపోయింది. దీంతో ఈపాటకు అప్పుడే యూట్యూబులో 2 మిలియన్ వ్యూస్ రావడమే కాకుండా టాప్ #3 పొజిషన్లో ట్రెండ్ అవుతుంది. భీమ్స్ స్వరపరచిన ఈ పాటను సాహితి చాగంటి, మంగ్లీలతో కలిసి ఆయనే పాడారు.
నక్కిన త్రినాధరావు ఈ సినిమాకు దర్శకుడు కాగా, శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఈ నెల 23న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ధమాకా ట్రైలర్ డిసెంబర్ 15, సాయంత్రం ఆరింటికి విడుదల కాబోతుంది.