బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో నటించిన షంషేరా చిత్రం బాక్సాఫీసు వద్ద వైఫల్యాన్ని చవిచూసింది. తాజాగా రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022లో ఆ సినిమా ఎందుకు అలరించలేకపోయిందో రణబీర్ చెప్పాడు. తాను చేసిన అతి కష్టమైన సినిమాల్లో షంషేరా ఒకటని వెల్లడించిన రణబీర్ ‘ఈ సినిమా పరాజయం పొందడం వెనక మేము చేసిన పొరపాట్లు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి నా గడ్డం. నేను ఈ సినిమా కోసం కృత్రిమ గడ్డాన్ని పెట్టుకున్నాను. ఎండలో షూటింగ్ చేసేటప్పుడు అది సహజంగా కనిపించలేదు. అందుకే ఈ సినిమా హిట్ అవ్వలేదని అనుకుంటా అన్నారు రణబీర్.