జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అవతార్ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. ప్రస్తుతం అవతార్ 2 కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 16న విడుదల కానుంది. కాగా, విడుదలకు ముందే అవతార్-2 రికార్డులు సృష్టిస్తుంది. భారత్ లో అత్యంత వేగంగా రూ.10కోట్ల విలువైన అడ్వాన్స్ బుకింగ్ లు సాధించిన సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఈ రికార్డు గతంలో 'డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్' పేరిట ఉండేది. ఇప్పుడు ఈ రికార్డును అవతార్-2 బద్దలుకొట్టింది.