కోలీవుడ్ స్టార్ హీరో తాలా అజిత్ కుమార్ నటిస్తున్న కొత్త చిత్రం "తునివు" ఫస్ట్ సింగిల్ 'చిల్ల చిల్ల' సాంగ్ ఈ రోజు సాయంత్రం ఆరున్నరకు విడుదల కాబోతుందని మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. ఈ సాంగ్ కోసం తాలా అభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఘిబ్రాన్ కంపోజ్ చేసిన ఈ ఫాస్ట్ బీట్ మాస్ సాంగ్ ను కోలీవుడ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ పాడారు.
హెచ్. వినోద్ ఈ సినిమాకు డైరెక్షన్ చేస్తున్నారు. బేవ్యూ ప్రాజెక్ట్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa