నిన్న విడుదలైన "లాఠీ" తెలుగు ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి చాలా మంచి స్పందన వస్తుంది. యూట్యూబులో #6 టాప్ పొజిషన్లో లాఠీ మూవీ ట్రెండ్ అవుతుంది. విశాల్ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్, హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సెస్.. లతో లాఠీ ట్రైలర్ ఆడియన్స్ దృష్టిలో ప్రత్యేకతను సంపాదించుకుంది. A . వినోద్ కుమార్ డైరెక్షన్లో పవర్ఫుల్ కాప్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 22న పాన్ ఇండియా భాషల్లో విడుదల కావడానికి సిద్ధమైంది. ఈ సినిమాలో సునైనా హీరోయిన్ గా నటిస్తుంది. రాణా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమణ, నందా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa