ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అవతార్ 2' కోసం అవసరాల శ్రీనివాస్?

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 14, 2022, 11:41 AM

జేమ్స్‌ కామెరూన్‌ అద్భుత సృష్టి అవతార్. ఈ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన అవతార్2 ది వే ఆఫ్‌ వాటర్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అవతార్ 2 తెలుగు వెర్షన్ కోసం నటుడు-దర్శకుడు అవసరాల శ్రీనివాస్ పనిచేశారని అంటున్నారు. తెలుగు డైలాగ్స్ అన్ని ఆయనే రాశారని ప్రచారం సాగుతోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక రిలీజ్‌కి ముందే కలెక్షన్ల పరంగా ఈ సినిమా రికార్డులు తిరగరాస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com