ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రణ్ బీర్ - శ్రద్ధకపూర్ల న్యూ మూవీ టైటిల్ గ్లిమ్స్ రిలీజ్..!!

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 14, 2022, 03:26 PM

నిన్న TJMM పోస్టర్ రిలీజ్ చేసి దాని ఫుల్ ఫార్మ్ కనుక్కోమని ఆడియన్స్ కు చిన్న టెస్ట్ పెట్టిన డైరెక్టర్ లవ్ రంజన్ ఈ రోజు చిన్న గ్లిమ్స్ ను విడుదల చేసి, మూవీ టైటిల్ ను విడుదల చేసారు. పోతే, ఈ సినిమాకు 'తూ ఝూటి మై మక్కార్' టైటిల్ ను ఫిక్స్ చేసారు.


లవ్ రంజన్ డైరెక్షన్లో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ఫస్ట్ టైం రణ్ బీర్ కపూర్, శ్రద్ధ కపూర్ జంటగా నటించబోతున్నారు. బోనీ కపూర్, డింపుల్ కపాడియా సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తున్నారు. లవ్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై అంకుర్ గార్గ్ ఈ సినిమాను నిర్మించారు.


టైటిల్ గ్లిమ్స్ లోనే మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ ను కూడా ఎనౌన్స్ చేసి ఆడియన్స్ ను షాక్ కు గురి చేసారు. హోలీ సందర్భంగా మార్చి 8వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa