మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న 'వాల్తేరు వీరయ్య' మూవీ నుండి రీసెంట్గా బాస్ పార్టీ సాంగ్ విడుదలై మెగా అభిమానులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంది. ప్రేక్షకాభిమానుల నుండి వస్తున్న విశేష స్పందన కారణంగా ఈ పాటకు యూట్యూబులో రోజు రోజుకూ వీక్షణలు పెరిగిపోతూ ఉన్నాయి. తాజాగా బాస్ పార్టీ సాంగ్ యూట్యూబులో 25 మిలియన్ వ్యూస్ మార్క్ ను క్రాస్ చేసినట్టుగా తెలుస్తుంది. మాస్ పల్స్ బాగా తెలిసిన DSP - ప్రేక్షకులకు ఈజీగా కనెక్ట్ అయ్యే కొరియోగ్రఫీ చేసే శేఖర్ మాస్టర్ - మ్యూజిక్ డైరెక్టర్ కొరియోగ్రాఫర్ ల కష్టాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించే మెగాస్టార్ కలయికలో వచ్చిన ఈ సాంగ్ ఒక్క మెగా అభిమానులకు మాత్రమే కాదు.. అందరికీ హాట్ ఫేవరెట్ గా నిలిచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa