టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "కళ్యాణం కమనీయం". ఇందులో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది. అనిల్ కుమార్ ఆళ్ళ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదలైంది. ఓ.. మనసా.. అని సాగే ఈ పాట హీరో హీరోయిన్ల వివాహ నేపథ్యంలో వస్తుంది. ఆది నుండి మొదలుకొని పెళ్లి తంతులో జరిగే ప్రతి ఘట్టాన్ని ఎంతో అందంగా ఈ పాటలో చూపించారు. శ్రవణ్ భరద్వాజ్ స్వపరిచిన ఈ పాటను లలిత కావ్య తో కలిసి ఆయనే పాడారు. కృష్ణ కాంత్ లిరిక్స్ అందించారు.
యూవీ కాన్సెప్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లకు రాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa