హిందీ బిగ్‌బాస్ ఓటీటీతో గుర్తింపు పొందిన బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్. తన వైవిధ్యమైన దుస్తులు, ఫోటోషూట్‌లతో ఎప్పుడూ హాట్‌టాపిక్‌గా నిలుస్తుంటుంది ఈ భామ. వాటిలో ఎక్కువగా అభ్యంతరకరమైన రీతిలో సెమీ న్యూడ్‌గా ఉండడం వల్ల విమర్శల పాలవుతూ ఉంటుంది. ఇది నచ్చని కొందరైతే అత్యాచారం చేసి చంపేస్తామని బెదిరింపులకి కూడా దిగారు. తాజాగా ఉర్పీ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని స్టోరీలను పోస్ట్ చేసింది. అందులో.. ఓ వ్యక్తి వాట్సాప్‌లో పంపిన మేసేజ్‌ల స్ర్కీన్ షాట్‌ని షేర్ చేసింది. దానికి.. ‘ఈ వ్యక్తి 3 సంవత్సరాల క్రితం నా బ్రోకర్. అతను తాజాగా నాకు మెసేజ్ చేయడం ప్రారంభించాడు. నన్ను అత్యాచారం చేసి చంపేస్తానని బెదిరించాడు'అని రాసుకొచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa