తలపతి విజయ్ అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న చిత్రం "వారిసు". తెలుగులో "వారసుడు" టైటిల్ తో ఈ సంక్రాంతి పండగకు థియేటర్లలో విడుదల కాబోతుంది.
వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు.
తాజా బజ్ ప్రకారం, ఈ మూవీ రన్ టైం ను మేకర్స్ లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. రెండు గంటల ముప్పై నిమిషాలపాటు వారిసు వెండితెరపై సందడి చెయ్యబోతున్నట్టు టాక్. మరి, ఈ విషయంపై అతి త్వరలోనే మేకర్స్ నుండి అఫీషియల్ క్లారిటీ రాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa