ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలీవుడ్ మార్కెట్లో జోరు చూపిస్తున్న రవితేజ "ధమాకా"..?

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 15, 2022, 05:40 PM

మాస్ రాజా రవితేజ నుండి ఈ ఏడాదిలో రాబోతున్న మూడవ చిత్రం "ధమాకా". మరి, ఈ ఏడాదిలోనే విడుదలైన ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలవగా, ఈ సినిమాతోనైనా రవితేజ ఈ యేడాదిని సక్సెస్ఫుల్ గా ముగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.


నక్కిన త్రినాధరావు వంటి మాస్ కమర్షియల్ డైరెక్టర్ తో రవితేజ ధమాకా సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే కదా. ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చెయ్యబోతున్నట్టు ఆల్రెడీ మేకర్స్ గతంలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. ఈ నేపథ్యంలో ధమాకా లిరికల్ సాంగ్స్ హిందీ లో కూడా విడుదలయ్యాయి.


తాజా బజ్ ప్రకారం, హిందీ మార్కెట్లో ధమాకా సినిమాకు భారీ ధర పలుకుతుందని తెలుస్తుంది. ధమాకా హిందీ డబ్బింగ్ హక్కులను మేకర్స్ దాదాపు 20 కోట్లకు అమ్మినట్టు టాక్ నడుస్తుంది. ఈ విషయంపై నిజానిజాలు తెలియాల్సి ఉంది. పోతే, ధమాకా మూవీ ఈ నెల 23న విడుదల కావడానికి రెడీ అవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa