'కుమారి 21F' ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్షన్లో నిఖిల్ సిద్దార్ధ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న విభిన్న ప్రేమకధా చిత్రం "18 పేజెస్". గోపిసుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. డిసెంబర్ 23న 18 పేజెస్ మూవీ థియేటర్లలో విడుదల కాబోతుంది.
ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదలైన అన్ని లిరికల్ సాంగ్స్ కు ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. తాజాగా మేకర్స్ నాల్గవ లిరికల్ సాంగ్ "నీవల్ల ఓ పిల్ల" విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసారు. ఈ మేరకు రేపు సాయంత్రం ఐదింటికి 18 పేజెస్ మూవీ నుండి నీ వల్లే ఓ పిల్ల లిరికల్ సాంగ్ రిలీజ్ కాబోతుందని పేర్కొంటూ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa