ఈ రోజు విడుదలైన "వీరసింహారెడ్డి" సెకండ్ సింగిల్ 'సుగుణ సుందరి' కి ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. 2. 6 మిలియన్ వ్యూస్ తో, 127 కే లైక్స్ తో ఈ సాంగ్ యూట్యూబ్ #1 ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. బాలయ్య క్రేజీ స్టెప్స్ తో ఈ సాంగ్ ఇన్స్టంట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్, హనీ రోజ్, దునియా విజయ్ కీరోల్స్ లో నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa