ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' పై లేటెస్ట్ బజ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 15, 2022, 08:24 PM

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహ బాలకృష్ణ సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాకి 'వీర సింహారెడ్డి' అనే టైటిల్ ని లాక్ చేసారు. వీరసింహా రెడ్డి జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. ఒకటి విలేజ్ బ్యాక్‌డ్రాప్ క్యారెక్టర్ అయిన వీరసింహారెడ్డి అయితే, మరొకటి యుఎస్-రిటర్న్ రోల్ అయిన బాల సింహారెడ్డి ఈ రెండు పాత్రల మధ్య మంచి వేరియేషన్ ఉంటుంది అని ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ యాక్షన్ డ్రామా సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ జోడిగా నటిస్తోంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్, దునియా విజయ్ కీలక  పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa