ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తదుపరి షెడ్యూల్‌కు సిద్దమవుతున్న నాని 'దసరా'

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 15, 2022, 08:32 PM

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో నేచురల్ స్టార్ నాని "దసరా" సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో నాని ఫుల్ మాస్ అవతార్‌లో కనిపించబోతుండగా, కీర్తి సురేష్ వెన్నెల పాత్రలో నటిస్తుంది.


తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా తదుపరి షెడ్యూల్ డిసెంబర్ 16 నుండి ప్రారంభం కానుందని ఫిలిం ఇండస్ట్రీ లో లేటెస్ట్ టాక్. ఈ నెలాఖరులోగా మొత్తం షూట్‌ను పూర్తి చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. యాక్షన్ డ్రామాగా ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.


ఈ సినిమా 30 మార్చి 2023న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa