కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు హెచ్ వినోద్ అండ్ నిర్మాత బోనీ కపూర్‌తో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ చిత్రానికి 'తునివు' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా ఈ హీస్ట్ డ్రామా జనవరి 10, 2023న విడుదల కానుంది.
తాజాగా ఇప్పుడు, తునివు యొక్క USA మరియు UK విడుదల తేదీని అక్కడ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న లైకా ప్రొడక్షన్స్ వెల్లడించింది. ఈ చిత్రం ఈ రెండు దేశాల్లో జనవరి 11, 2023న విడుదల అవుతుంది. ఈ సినిమాలో అజిత్ కి జోడిగా మంజు వారియర్ నటిస్తుంది. సంజయ్ దత్, సముద్రఖని, మహానటి శంకర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాని బోనీ కపూర్ తన హోమ్ బ్యానర్ బే వ్యూ ప్రాజెక్ట్స్ ఎల్‌ఎల్‌పిపై నిర్మించారు. ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa