ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్టీఆర్ 30 లో ఆ హీరోయిన్.. ఆల్మోస్ట్ కంఫర్మ్..?

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 16, 2022, 07:45 AM

RRR పాన్ ఇండియా సక్సెస్ తదుపరి నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ చాలా సమయం తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయినా కానీ ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకాభిమానుల్లో రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి.


కొరటాల శివ డైరెక్షన్లో ఒక మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తారక్ ఆ మూవీకి సంబంధించి ఎలాంటి లూప్ హొల్స్ లేకుండా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.


ఈ ప్రాజెక్ట్ పై వినిపిస్తున్న తాజా బజ్ ప్రకారం, బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో తారక్ కు జోడిగా నటించడం ఆల్మోస్ట్ కంఫర్మ్ అయ్యిందని తెలుస్తుంది. జాన్వీకి తారక్ అంటే చాలా ఇష్టం, అలానే ఆమె ఎప్పటినుండో సౌత్ సినిమాల్లో నటించేందుకు ఆశగా ఎదురుచూస్తుంది. ఈ నేపథ్యంలో ఎప్పటి నుండి ఎన్టీఆర్ 30లో జాన్వీ హీరోయిన్ గా నటిస్తుందని ప్రచారం జరుగుతుండగా, తాజాగా ఆ విషయం ఆల్మోస్ట్ కంఫర్మ్ అయిందని తెలియడంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa