టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ట్యాలెంటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ హీరోల్లో అడివిశేష్ ఒకరు. శేష్ రీసెంట్ ఫిలిం హిట్ 2. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్ కమర్షియల్ సక్సెస్ గా నిలిచింది. ప్రస్తుతం హిట్ 2 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న శేష్ ఈ రోజు 38వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనకు సోషల్ మిడిల్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేస్తున్నారు. ఈ ఏడాది శేష్ బర్త్ డే కు చాలా స్పెషాలిటీ ఉంది. ఎందుకంటే, ఈ ఏడాదిలోనే విడుదలైన "మేజర్" కు పాన్ ఇండియా వ్యాప్తంగా సూపర్ పాజిటివ్ రివ్యూలు రాగా, రీసెంట్గా రిలీజైన హిట్ 2 కూడా సూపర్ హిట్ అయ్యింది.
2002లో 'సొంతం' సినిమాలో వెంకట్ అనే చాలా చిన్న క్యారెక్టర్ తో వెండితెర తెరంగేట్రం చేసిన శేష్ ఆపై 2010లో 'కర్మ' తో లీడ్ హీరోగా డిబట్ ఎంట్రీ చేసారు. ఈ సినిమాకు ఆయనే డైరెక్షన్ కూడా చేసారు. ఆపై విలన్, సపోర్టింగ్, హీరో రోల్స్ చేస్తూ తనలోని విలక్షణమైన నటనను ప్రేక్షకులకు కనబరుస్తూ, వారి ఫేవరెట్ హీరోగా మారారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa