నందమూరి బాలకృష్ణతో వివాదం కారణంగా ఈ మధ్య హాట్ టాపిక్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి సోదరుడు, ప్రముఖ నటుడు నాగబాబు. బాలయ్య ఎవరో తనకు తెలియదంటూ చేసిన కామెంట్స్‌తో ఇటు సినీ రంగం, అటు రాజకీయ రంగంలో కలకలం రేపారు. ఇక్కడితో వదలకుండా నందమూరి హీరోపై సోషల్ మీడియా వేదికగా వరుసగా పోస్టులు పెడుతూ వస్తున్నారు. అయితే, రెండు రోజులుగా ఆయన మరోసారి హైలైట్ అవుతున్నారు. అసలు బాలకృష్ణను ఎందుకు కామెంట్ చేయాల్సి వస్తుందో వివరిస్తూ వీడియోలను విడుదల చేస్తున్నారు. ఇప్పటికి ఐదు వీడియోలను వదిలిన ఆయన.. అందులో బాలయ్య.. మెగా ఫ్యామిలీపై, జనసేన పార్టీపై చేసిన కామెంట్స్‌ను చూపించారు. అలాగే వాటికి సంబంధించిన వివరణను కూడా వినిపించారు. బాలయ్యను విమర్శించే క్రమంలో నాగబాబు బయోపిక్ సినిమాలపైనా కామెంట్ చేశారు.
‘‘కట్టు కథలు కొన్ని.. కల్పనలు ఇంకొన్ని….. చుట్టనేల.. మూట కట్టనేల…. నిజం కక్కలేని బయోపిక్కులొద్దయా…. విశ్వదాభారామ.. వినరా మామా(కవిత్వాలు మాకూ వచ్చండోయ్)’’ అంటూ నాగబాబు చేసిన కామెంట్లపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తొలిసారి స్పందించారు. ‘‘కామెంట్లు చేయడంలో నన్ను మించిపోయారనే నా బాధ ఒకవైపు.. తన స్టార్ బ్రదర్స్‌ను సమర్థించడంలో సూపర్‌స్టార్ అయిపోయారనే ఆనందం ఒకవైపు.. ఒక కంట కన్నీరు, మరో కంట పన్నీరు. నాగబాబు గారూ హ్యాట్సాఫ్. మీ సోదరులను మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో మేం కూడా అంతే ప్రేమిస్తున్నాం’’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది చూసిన నందమూరి అభిమానులు వర్మను సపోర్ట్ చేస్తుండగా, మెగా అభిమానులు మాత్రం తిట్టుకుంటున్నారు. గతంలో పవన్‌కు వర్మకు మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa