ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిరంజీవి చిన్నల్లుడు తో రొమాన్స్ చేయనున్న రియా చక్రవర్తి

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 08, 2019, 07:21 PM

చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ‘విజేత’అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది తెలిసిందే. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో కొంత గ్యాప్ తీసుకొని, మళ్ళీ ఇప్పుడు తన రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకురాబోతున్నాడు. ఈ సినిమాను పులివాసు దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది.


ఈ సినిమాలో హీరోయిన్‌గా రియా చక్రవర్తిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. రియా.. ఇంతకుముందు‘తూనీగ తూనీగ’చిత్రంలో నటించింది. అంతేకాకుండా హిందీలో ‘హాఫ్ గర్ల్ ఫ్రెండ్', 'బ్యాంక్ చోర్', 'జలేబి’వంటి సినిమాలు చేసింది. ఇంకా ఈ సినిమాలో సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణమురళి నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa