పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కే బ్యాక్ టు బ్యాక్ షూటింగులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇంతటి బిజీ షెడ్యూల్ లో కూడా ప్రభాస్ మారుతితో ఒక సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఐతే..ఇప్పటివరకు లేదు కానీ ఈ సినిమా గురించిన న్యూస్ రోజుకొకటి వినిపిస్తూ..డార్లింగ్స్ ఫ్యాన్స్ లో అంచనాలను పెంచేస్తుంది.
తాజాగా ఈ సినిమా షూటింగ్ లొకేషన్ నుండి ఒక పిక్ లీకై సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇందులో ప్రభాస్, డైరెక్టర్ మారుతీ పక్కనే కూర్చుని ఏదో డిస్కస్ చేస్తూ ఉంటారు. ఐతే, ఈ పిక్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఒకే ఒక ఎలిమెంట్...ప్రభాస్ వింటేజ్ లుక్. అన్ స్టాపబుల్ షోలో వింటేజ్ ప్రభాస్ యాటిట్యూడ్, బిహేవియర్ చూసి మతి పోగొట్టుకున్న ఫ్యాన్స్ ఇప్పుడు వింటేజ్ లుక్ లో ప్రభాస్ ను చూసి తెగ సంబరపడిపోతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa