టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా ఆయన అప్ కమింగ్ సినిమాల నుండి స్పెషల్ అప్డేట్స్ వస్తున్నాయి. ఆల్రెడీ అనుష్క 48 నుండి నవీన్ క్యారెక్టర్ పోస్టర్ విడుదల కాగా, తాజాగా అనగనగా ఒక రాజు చిత్రం నుండి నవీన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు.
అనగనగా ఒక రాజు చిత్రానికి కళ్యాణ్ శంకర్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త బ్యానర్ లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.