స్టార్ యాంకర్ సుమ కనకాల.. తాను యాంకరింగ్ వదిలేస్తున్నట్లు వస్తోన్న వార్తలపై స్పందించింది. ‘రీసెంట్ గా నేను న్యూఇయర్ ఈవెంట్ లో పాల్గొన్నాను. అందులో కాస్త ఎమోషనల్ అయిన మాట వాస్తవమే. అయితే, ఈవెంట్ మొత్తం చూస్తే మీకు అసలు విషయం తెలుస్తుంది. నేను టీవీ కోసం, ఎంటర్ టైన్మెంట్ కోసమే పుట్టా. నేను ఎక్కడికీ వెళ్లను. కాబట్టి మీరు హ్యాపీగా ఉండండి. హ్యాపీ న్యూ ఇయర్.’ అని సుమ ఓ వీడియోను పోస్ట్ చేశారు. తనకు చాలా ఫోన్లు వచ్చాయని అందుకే స్పందించినట్లు చెప్పారు.