పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన రాయ్ లక్ష్మి గ్లామర్ రోల్స్ లో అందాలు ఆరబోసింది. లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూనే ఐటెం సాంగ్స్ లో కూడా మెరుస్తోంది. 33 ఏళ్ల రాయ్ లక్ష్మి దాదాపు 15 ఏళ్ల క్రితమే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. టాలీవుడ్ లో శ్రీకాంత్ హీరోగా నటించిన కాంచనమాల కేబుల్ టీవీ చిత్రంతో రాయ్ లక్ష్మి హీరోయిన్ గా 2005లో ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రం నుంచే రాయ్ లక్ష్మీ అందాల ఆరబోత ప్రదర్శించింది. క్రమంగా రాయ్ లక్ష్మి క్రేజ్ పెరుగుతూ వచ్చింది. చాలా చిత్రాల్లో హీరోయిన్ గా మెరిసిన రాయ్ లక్ష్మి ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్ తో కూడా పాపులర్ అయింది. బికినీ పిక్స్ పోస్ట్ చేస్తూ యువతని విరహ వేదనలో ముంచేస్తోంది. మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ఉన్న రాయ్ లక్ష్మి ఫోజులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. బీచ్ లో బ్లాక్ టాప్ లో ఆమె ఇచ్చిన ఫోజులు కళ్ళు చెదిరే హాట్ నెస్ తో అదరగొడుతున్నాయి.