ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'టాప్ గేర్' కంటెంట్ రిచ్ మూవీ నిర్మాత శ్రీధర్ రెడ్డి

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 29, 2022, 08:12 PM

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆది సాయికుమార్ తన తదుపరి ప్రాజెక్ట్ ని శశికాంత్‌ దర్శకత్వంలో చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'టాప్ గేర్‌' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన జోడిగా రియా సుమన్‌ నటిస్తుంది. ఈ చిత్రం డిసెంబర్ 30, 2022న థియేటర్లలో విడుదల కానుంది.


తాజాగా ఈ సినిమా విడుదలకు ముందు శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ నిర్మాత కె.వి.శ్రీధర్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. సినిమా చాలా బాగా వచ్చిందని, ఆది సాయికుమార్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా పై నిర్మాత చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని, టాప్ గేర్ తనకు నిర్మాతగా మంచి పేరు తెస్తుందని పేర్కొన్నారు. టాప్ గేర్ కూడా కంటెంట్-రిచ్ మూవీ మరియు ప్రతి టెక్నీషియన్ ఈ చిత్రం కోసం కష్టపడ్డారు, దాదాపు 200కి పైగా థియేటర్లలో సినిమాను విడుదల చేయనున్నట్టు నిర్మాత తెలిపారు.


బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, గిరిధర్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించబడిన టాప్ గేర్‌కి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత అందిస్తున్నారు. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందనుంది. ఈ చిత్రాన్ని కె.వి.శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa